Header Banner

తిరుమలలో విపరీతమైన రద్దీ.. అదనపు కౌంటర్ల ఏర్పాటు! శ్రీవారిమెట్టు నడక భక్తులకు..

  Fri Jun 06, 2025 21:50        Devotional

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారి భక్తులకు ఉచితంగా అందజేసే ఎస్ఎస్‌డీ (స్లాటెడ్ సర్వ దర్శన్‌) టోకెన్ల జారీ కోసం అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉన్న 10 కౌంటర్లకు అదనంగా మరో నాలుగు కౌంటర్లను టీటీడీ అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మొత్తం ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ కౌంటర్ల సంఖ్య 14కు చేరింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన కౌంటర్ల ద్వారా టోకెన్ల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

 

ఇది కూడా చదవండి: న్యూజిలాండ్ లో కరోనా విజృంభణ.. 50 శాతానికి పైగా! భారత్‌లోనూ స్వల్పంగా..

 

14 కౌంటర్లలో, ఐదు కౌంటర్లను ప్రత్యేకంగా శ్రీవారిమెట్టు కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకునే భక్తుల కోసం కేటాయించారు. ఈ భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అందించడం ప్రారంభించారు. మిగిలిన తొమ్మిది కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లను భక్తులకు అందజేస్తున్నారు. ఎస్ఎస్‌డీ టోకెన్ల కోసం భక్తులు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. వాతావరణం అనుకూలించకపోయినా, వర్షంలో తడుస్తూనే టోకెన్ల కోసం కౌంటర్ల వద్ద భక్తులు ఓపికగా వేచి ఉండటం కనిపించింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో, క్యూలైన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు మరియు పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TTD #Tirupati #DharmaReddy #BhumanaKarunakarReddy #TDP #Case